కొన్నేళ్లుగా నటనకు బ్రేకిచ్చిన మంచు మనోజ్ ఇప్పుడు వరస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ఆయన యాక్ట్ చేసిన భైరవం చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవ్వగా.. ఇకపై తేజ సజ్జ మిరాయ్ లో పవర్ ఫుల్ పాత్ర లోను, వాట్ ద ఫిష్ లో హీరోగానూ చేస్తున్నాడు.
ఈరోజు మే 20 మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఆయన ననటించబోతున్న కొత్త సినిమాని అనౌన్స్ చేసారు మేకర్స్. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి రక్షక్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నవీన్ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది.
మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించారు. పోస్టర్‌పై కనిపించే The hidden truth is never hidden forever (దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు) అనే ట్యాగ్‌లైన్ కథలోని మిస్టరీని సూచిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.