మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే. అభిమానులకు పండగ రోజు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం అభిమానులు ఎదురు చూపులకు తెరపడింది. గత రాత్రి 12 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ ఎన్టీఆర్ అభిమానుల మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే ని కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చెయ్యగా.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ నుంచి సింపుల్ గా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పేసారు మేకర్స్.
కానీ ఎన్టీఆర్ హిందీలోకి గ్రాండ్ గా అడుగుపెట్టబోయే వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసే టీజర్ వదిలారు నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్ వారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ కి వార్ 2న నుంచి బర్త్ డే కి స్పెషల్ ట్రీట్ అందింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏది, ఎలా కావాలని కోరుకున్నారో అంతకుమించి అనేలా వార్ 2 టీజర్ ఉండడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది.
వార్ 2 లో ఎన్టీఆర్ లుక్స్ కానీ, నా కళ్ళు నిను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయ్ కబీర్ అనే డైలాగ్స్ కానీ అన్ని ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేస్తున్నాయి. ఎన్టీఆర్-హృతిక్ నడుమ యాక్షన్ పీక్స్ అనేలా ఉంది. స్టైలిష్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ యాక్షన్ కి మాత్రం ఫ్యాన్స్ పడిపోతున్నారు. వార్2 లో ఎన్టీఆర్ కి హృతిక్ తో ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారనేది టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.
అభిమానులు మాత్రం వార్ 2 నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువ ట్రీట్ ఇచ్చారు, ఎన్టీఆర్ ని ఈ రేంజ్ యాక్షన్ తో చూసి చాలా కాలమైంది, వార్ 2 హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా అవడం గ్యారెంటీ, ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ హిందీ డెబ్యూ వార్ 2 అంటూ మాట్లాడుకుంటున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం, ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ నడుమ వచ్చే యాక్షన్ ట్రీట్, రిచ్ విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, BGM, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ వార్ 2 టీజర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.