తమిళనాట రీసెంట్ గా విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో కథాకథలుగా వింటున్నాము. మే 1 న స్టార్ హీరోల తో పోటీ పడి చిన్న చిత్రంగా థియేటర్స్ లోకి వచ్చి డీసెంట్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం చూసి పొగిడిన వారే కానీ పొగడని వారు లేరు. మే 1 న విడుదలైన ర్ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పటికే దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి పెద్ద హిట్ గా నిలిచింది.
శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అబిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో ధనుష్ వంటి ప్రముఖులు కూడా అభినందించారు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి టూరిస్ట్ ఫ్యామిలీని పొగిడేశారు.
టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాన్ని వీక్షించిన రాజమౌళి సోషల్ మీడియా వేదికగా.. అద్భుతమైన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ చూశాను. మనసును హత్తుకునేలా, కడుపుబ్బా నవ్వించే కామెడీతో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నన్ను ఆసక్తి పరిచింది. అబిషన్ జీవింత్ గారి రచన, దర్శకత్వం మెచ్చుకుని తీరాల్సిందే. ఇటీవలి కాలంలో నాకు లభించిన ఉత్తమ సినిమాటిక్ అనుభవం అంటూ రాజమౌళి టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాన్ని దర్శకుడ్ని పొగడడం హాట్ టాపిక్ గా మారింది.
మరి దర్శకధీరుడే టూరిస్ట్ ఫ్యామిలీని చూడమని చేబితే తెలుగు ప్రేక్షకులు ఆగుతారా, ఆ చిత్రం ఓటీటీ నుంచి ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అప్పుడే వెయిట్ చెయ్యడం స్టార్ట్ చేసేసారు.