కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ గా బిజీ కాబోతున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇకపై సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాలవైపు మళ్ళాలి అనుకున్నారు. కానీ విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన GOAT అట్టర్ ప్లాప్ అవడంతో విజయ్ మరో సినిమా చేసి హిట్ కొట్టి అప్పుడే సినిమాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యి మరో సినిమా స్టార్ట్ చేసారు.
వినోద్ దర్శకత్వంలో జననాయగన్ గా విజయ్ మొదలు పెట్టిన ఈ చిత్రం తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్ గా ప్రచారం జరిగింది. తాజాగా విజయ్ జననాయగన్ కి భగవంత్ కేసరికి అసలు సంబంధం లేదు అంటున్నారు. జననాయగన్, భగవంత్ కేసరి రీమేక్ కాదని భగవంత్ కేసరిలోని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎపిసోడ్ విజయ్‌ను ఆకట్టుకుందని..
కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ ని ఉపయోగించుకునేందుకు భగవంత్ కేసరి నిర్మాత సాహుకి విజయ్ మేకర్స్ నాలుగున్నర కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఆ ఒక్క ఎపిసోడ్ మినహా జననాయగన్ చిత్రానికి భగవంత్ కేసరితో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.