Advertisementt

సూపర్ స్టార్ పై మైత్రి మూవీస్ కన్ను

Sat 17th May 2025 04:10 PM
rajinikanth  సూపర్ స్టార్ పై మైత్రి మూవీస్ కన్ను
Mythri Movies eyeing superstar సూపర్ స్టార్ పై మైత్రి మూవీస్ కన్ను
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఈమధ్యన పరభాషా హీరోలవైపు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేస్తూ ఉండడమే కాదు, కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ తెరకెక్కించారు, అలాగే తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తో హిందీలోకి జాట్ తీశారు. 

ఆ రెండు చిత్రాలు బిగ్ హిట్ అవడంతో మైత్రి వారి కన్ను ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ పై పడినట్లుగా తెలుస్తుంది. ర‌జ‌నీకాంత్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసే ప‌నిలో మైత్రీ మూవీస్ నిమ‌గ్న‌మై ఉందని, ఈ మేర‌కు ర‌జ‌నీకాంత్ తో సంప్ర‌దింపులు కూడా మొద‌ల‌య్యాయ‌ని అది కూడా తెలుగు దర్శకుడితో అని తెలుస్తోంది. 

స‌రిపోదా శ‌నివారం ఫేమ్ వివేక్ ఆత్రేయ ఆ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ఒక కథ ప్రిపేర్ చేసుకున్నాడని, ఆ కథతోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రజినీకాంత్ ని ప్రోచ్ అవుతున్నారని, ఒకవేళ వివేక్ ఆత్రేయ కాకపోయినా మరో క్రేజీ దర్శకుడితో రజినీకాంత్ తో సినిమా చేసే ప్లాన్లో మైత్రి ఉందట. 

Mythri Movies eyeing superstar:

Mythri Movie Makers and Rajinikanth Film on Cards?

Tags:   RAJINIKANTH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ