విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్త గత కొన్నేళ్లుగా వినబడుతూనే ఉంది. ఎక్కడ చూసినా అంటే లంచ్ డేట్, ఇంకా వెకేషన్స్ అంటూ తిరిగే ఈ జంట పెళ్లి చేసుకుంటారని వారి వారి అభిమానులు అనుకుంటున్నారు. రీసెంట్ గా రష్మిక ఆనంద్ దేవరకొండ మూవీ ఓపెనింగ్ కి రావడం ఈ వార్తలకు బలం చేకూరింది, ఇంకా రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ దేవరకొండ ఇంట్లోనే స్టే చేస్తుంది అంటూ ఉంటారు.
తాజాగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం కింగ్ డమ్ ప్రమోషన్స్ లో భాగంగా ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నటి రష్మిక ను వివాహం చేసుకుంటారా అని సదరు యాంకర్ ప్రశ్నించగా, రష్మిక తో ఇంకా చాలా సినిమాలు యాక్ట్ చెయ్యాలి, ఆమె ఎంతో మంచి వ్యక్తి, అంతే అందమైన అమ్మాయి.
ప్రెజెంట్ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎలాంటి ఆలోచన లేదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన విజయ్ ని మీ లైఫ్ పార్ట్నర్ లో ఉండాల్సిన క్వాలిటీస్ రశ్మికలో ఉన్నాయా అంటే విజయ్ మాత్రం మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటాను అంటూ ఒంకరటింకరగా సమాధానమిచ్చాడు.