జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నంత కాలం బటన్ నొక్కుడు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోవడం తప్ప, ఆయన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో జగన్ ఉన్నారు, జగన్ చుట్టూ ధనుంజయ్ రెడ్డి, సజ్జల, వైవి సుబ్బారెడ్డి లాంటి పెద్దలు కోట కట్టి జగన్ ని అమాయకుడిని చేసి ఆడుకున్నారు, జగన్ మంచోడే, ఆయన చుట్టూ ఉన్నోళ్లే దొంగలు అంటూ బ్లూ మీడియా పదే పదే చెబుతూ వస్తుంది. కార్యకర్తలనే కాదు ఆఖరికి ఎమ్యెల్యేలు, మంత్రులను కూడా జగన్ ని కలవకుండా సజ్జల, అలాగే ధనుంజయ్ రెడ్డిలాంటి వాళ్ళు అడ్డుకున్నారని బ్లూ మీడియా జగన్ ని నిద్ర లేపేందుకు ట్రై చేస్తూనే ఉంది.
ఇప్పుడు లిక్కర్ కేసులో జగన్ తప్పేమి లేదు, ఆయన చుట్టూ చేరిన వాళ్ళే దొంగలుగా మారి లిక్కర్ స్కామ్ చేసారు, సజ్జల దగ్గర నుంచి ఇప్పుడు అరెస్ట్ అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకు అందరూ జగన్ కు తెలియకుండా స్కామ్ లు చేసారు, జగన్ అమాయకుడు, తన చుట్టూ దొంగలను పెంచి పోషించాడంటూ బ్లూ మీడియా మరోసారి జగన్ ను వెనకేసుకొస్తుంది.
లిక్కర్ స్కామ్ లో విజయ్ సాయి రెడ్డి రాజ్ కసిరెడ్డిని అడ్డంగా ఇరికించి రాజకీయాలకు రాం రాం చెప్పేసాడు, లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసారు, ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుతో లిక్కర్ స్కామ్ లో నాటి సీఎంవో కార్యాలయం ప్రమేయం ఉందని ఇది నేరుగా జగన్ వైపే వేలెత్తి చూపిస్తుంది.
అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఈ లిక్కర్ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పి జగన్ కుడి భుజం, ఎడమ భుజం అయినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో జగన్ కి కూడా ఇబ్బంది తలెత్తేలా ఉండడం వైసీపీ కార్యకర్తలను అందోళనకు గురి చేస్తుంది.
IAS అధికారి ధనుంజయ్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్యెల్యేలను, మంత్రులను సీఎం ని కలవకుండా తన వద్దకే రప్పించుకుని, వారిని పడిగాపులు పడేలా చేసాడు, ఇందులో జగన్ తప్పేమి లేదు, జగన్ ని వెనక్కి నెట్టి వీరే అధికారం చెలాయించారు, ఇప్పుడు జగన్ ని ఇబ్బందుల్లో పడేసారని బ్లూ మీడియా వాదిస్తుంది. మరి లిక్కర్ కేసులో ఇంకెన్ని అరెస్ట్ లు చూడాలో మరి అని అందరూ మాట్లాడుకుంటున్నారు.