మరో మూడు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. ఆర్.ఆర్.ఆర్, దేవర సక్సెస్ తర్వాత వస్తున్న బర్త్ డే కావడం, అలాగే క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఎన్టీఆర్ చేతిలో ఉండడంతో అభిమానులకు ఈ బర్త్ డే చాలా స్పెషల్ అనే చెప్పాలి.
ఇప్పటికే వార్ 2నుంచి ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ సిద్దమవడము, కో స్టార్ హృతిక్ రోషన్ దానిని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చెయ్యడమూ చూసాము. ఇక ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్(వర్కింగ్ టైటిల్) నుంచి స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ సిద్ధం చేశారనే వార్త ఉంది. అది నిజమని యూనిట్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
కానీ ఇప్పుడు డ్రాగన్ నుంచి గ్లింప్స్ రావడం లేదు అంటూ మేకర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసారు. కారణం వార్ 2 నుంచి ఎన్టీఆర్ కోసం స్పెషల్ అప్ డేట్ వస్తుంది, అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ కారణం చేత ముందుగా ఎన్టీఆర్ బర్త్ డే కి ప్లాన్ చేసిన #NTRNeel గ్లింప్స్ తరువాత తేదీకి మార్చబడింది.. అంటూ ఫ్యాన్స్ డిజప్పాయింట్ చేసే వార్త అందించారు.
అంటే డ్రాగన్ నుంచి కేవలం ఎన్టీఆర్ లుక్ మాత్రమే వదిలే అవకాశం ఉంది. సో వార్ 2 కారణం #NTRNeel కాంబో గ్లింప్స్ ని బర్త్ డే రోజున అభిమానులు మిస్ అవుతున్నారన్నమాట.