Advertisementt

మరణ మాస్ మినీ రివ్యూ

Fri 16th May 2025 01:22 PM
marana mass  మరణ మాస్ మినీ రివ్యూ
Marana Mass Movie Mini Review మరణ మాస్ మినీ రివ్యూ
Advertisement
Ads by CJ

మలయాళంలో హిట్ అయిన చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయంటే తెలుగు ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ థ్రిల్లర్స్ ఐడెంటిటీ, సూక్ష్మదర్శిని, రేఖా చిత్రం ఇలా చాలా చిత్రాలు ఓటీటీలోకి రాగానే తెలుగు ప్రేక్షకులు వీక్షించేస్తున్నారు. మలయాళంలో కామెడీ హీరోగా మారిన దర్శకుడు కమ్ నటుడు బాసిల్ జోసెఫ్ నటించే చిత్రాలంటే తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. జయ జయ జయ జయహే తర్వాత సూక్ష్మదర్శినితో అద్దరగొట్టిన బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ మూవీ మరణ మాస్. సీరియల్ హత్యల నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా ఏప్రిల్ 10న మలయాళ థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు మే 15 నుంచి మరణ మాస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

మరణ మాస్ మినీ స్టోరీ: 

ఓ గ్రామంలో వరుసగా వయసుపైబడిన వారిని సీరియల్ కిల్లర్ హత్య చేస్తూ ఉంటాడు, సీరియల్ కిల్లర్ కి భయపడి ఆ గ్రామస్తులు. చీకటిపడితే చాలు బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. కిల్లర్ హత్య చేసిన వారి మొహం పై గాట్లు పెట్టి నోట్లో అరటిపండు పెడుతూ ఉంటాడు. దానితో సీరియల్ కిల్లర్ కి గ్రామస్తులు బనానా కిల్లర్ గా పేరు పెట్టుకుంటారు. ఆ సీరియల్ కిల్లర్ కథలోకి ల్యూక్ (బాసిల్ జోసెఫ్) ఎలా వచ్చాడు, ల్యూక్, జెస్సీ (అనీష్మా) ల ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుంది, బస్సు డ్రైవర్, కండక్టర్లు ఓ హత్య లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మరణ మాస్ మినీ స్టోరీ. 

మరణ మాస్ ఎఫర్ట్స్ :

బాసిల్ జోసెఫ్ ఏంటి హీరో అనుకునేవాళ్లకు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే సమాధానమిచ్చేస్తాడు. హీరో అంటే ఫైట్స్, లేదంటే ఎలివేషన్స్ సీన్స్ మాత్రమే కాదు, టాలెంట్ ఉంటే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చెయ్యొచ్చు అని బాసిల్ జోసెఫ్ పదే పదే నిరూపిస్తున్నాడు. మరణ మాస్ లోను బాసిల్ జోసెఫ్ డిఫ్రెంట్ గెటప్ యూత్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. జెస్సీ పాత్రలో అనీష్మా ధైర్యంగా కనిపించే అమ్మాయిగా, బాక్సింగ్ నేర్చుకున్నా అన్నిటికి బెదిరిపోయే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. అలాగే పోలీస్ ఆఫీసర్ గా అజయ్ రామచంద్రన్, బస్సు డ్రైవర్ గా జిక్కు, సైజు సన్నీ, బాబు ఆంటోని, సీరియల్ కిల్లర్ గా రాజేశ్ మాధవన్ అందరూ సరదాగా నవ్వించారు. 

మరణ మాస్ విశ్లేషణ:

దర్శకుడు శివప్రసాద్ మరణ మాస్ ని సీరియస్ గా స్టార్ట్ చేసి డార్క్ కామెడీగా సినిమాని మలుద్దామనుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో సీరియల్ కిల్లర్, అతన్ని పట్టుకునేందుకు పోలీస్ ల హడావిడి తప్ప మరేది కనిపించదు, సెకండ్ హాఫ్ లో బస్సు డ్రైవర్, అలాగే సీరియల్ కిల్లర్,  ల్యూక్, జెస్సీ ల మధ్య సాగే కామెడీ లవ్ కనిపిస్తుంది. అక్కడక్కడా నవ్వించినా, కొన్నిచోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు. జోక్స్ సరిగ్గా పేలలేదు. బాసిల్ జోసెఫ్ విజయ్ మాదిరి చేతులు పైకెత్తి ఫోజులివ్వడం, అలాగే బాసిల్ జోసెఫ్ స్టయిల్ కి యూత్ కనెక్ట్ అవుతారు కానీ, బాసిల్ జోసెఫ్ ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఒకొనొక సమయంలో బాసిల్ ఇందులో హీరోనేనా అనే డౌట్ క్రియేట్ అవుతుంది. సైకో కిల్లర్ అనగానే కాస్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. కానీ ఇందులో అది ఏ కోశానా కనిపించదు. పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ పాత్రను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. సినిమా మొత్తం ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఉండాల్సింది, కానీ జస్ట్ కామెడీతోనే తేల్చేసారు. జేకే మ్యూజిక్ మాత్రం మరణ మాస్ కు హైలెట్ అని చెప్పాలి, చాలా సీన్స్ లో BGM ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రానికి ప్రముఖ హీరో తోవినో థామస్ నిర్మాత కావడం విశేషం. 

Marana Mass Movie Mini Review:

Marana Mass Movie Telugu Review

Tags:   MARANA MASS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ