Advertisementt

బ‌క్క చిక్కిన కరణ్ జోహార్.. అసలు కార‌ణం

Fri 16th May 2025 11:23 AM
karan johar  బ‌క్క చిక్కిన కరణ్ జోహార్.. అసలు కార‌ణం
Karan Johar lost 20 kgs in just 7 months with OMAD బ‌క్క చిక్కిన కరణ్ జోహార్.. అసలు కార‌ణం
Advertisement
Ads by CJ

ఏడాది కాలంగా బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ కరణ్ జోహార్ అనూహ్యంగా బ‌రువు త‌గ్గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఓజెంపిక్ లేదా మౌంజారో వంటి మందుల వల్ల ఇది సాధ్య‌మైంద‌ని అంతా అనుమానించారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను క‌ర‌ణ్ బ‌లంగా తిరస్కరించారు. త‌న‌లో ఈ మార్పు వెన‌క‌ OMAD లేదా వన్ మీల్ ఎ డే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలిపాడు.

తాజా పాడ్ కాస్ట్ లో క‌ర‌ణ్ మాట్లాడుతూ.. తాను రోజుకు ఒక భోజ‌నం అనే నియ‌మిన్ని పాటించాన‌ని తెలిపాడు. ఏడు నెలలు రాత్రి 8 లేదా 8:30 గంటలకు మాత్రమే తిన్నానని వెల్లడించాడు. నేను ఓఎంఏడి ప్ర‌క్రియ‌ను   అనుసరించాను. దీని అర్థం రోజుకు ఒక భోజనం. మొదటి ఏడు రోజులు చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఏడు నెలలు ఇలా చేసాను. నేను రాత్రి భోజనం మాత్ర‌మే తిన్నాను.. అని తెలిపాడు. ఇలా చేయ‌డం ద్వారా 20కేజీల బ‌రువు క‌ర‌ణ్ ఏడు నెల‌ల్లో త‌గ్గాడు. త‌న భోజ‌నంలో గ్లూకోజ్ కానీ, లాక్టోస్ కానీ, గ్లూటెన్ కానీ లేవు అని తెలిపాడు.

చాలా సింపుల్ గా తిండి కట్టేస్తే, నోటిని అదుపులో ఉంచుకుంటే బ‌రువు త‌గ్గ‌డం క‌ష్టం కాద‌ని సూచించాడు. ఇది చాలామంది అధిక బ‌రువు స‌మ‌స్య ఉన్న‌వారికి మంచి టిప్. చాలా మంది `క‌ల‌ర్స్`లో ఫ్యాట్ క‌రిగించే టిప్స్ కోసం వెళ్లాల్సిన అవ‌స‌రం లేదని దీని మీనింగ్.

Karan Johar lost 20 kgs in just 7 months with OMAD:

Karan Johar weight loss plan helped him lose 20kgs

Tags:   KARAN JOHAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ