Advertisementt

ఫైనల్లీ హరి హర వీరమల్లు రాక ఫిక్స్

Fri 16th May 2025 01:37 PM
hari hara veera mallu  ఫైనల్లీ హరి హర వీరమల్లు రాక ఫిక్స్
Hari Hara Veera Mallu storms into cinemas this June ఫైనల్లీ హరి హర వీరమల్లు రాక ఫిక్స్
Advertisement
Ads by CJ

 

ఫైనల్లీ హరి హర వీరమల్లు రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరి హర వీరమల్లు పై అంచనాలు ఎంతగా ఉన్నాయో, విడుదల తేదీపై పవన్ ఫ్యాన్స్ లో అంతే ఆత్రుత ఉంది. కారణం పదే పదే వీరమల్లు రిలీజ్ తేదీ వాయిదాపడుతూ వస్తుంది. ఇప్పుడు మేకర్స్ కి మంచి డేట్ చూసి హరి హర వీరమల్లు విడుదల తేదీని ఎనౌన్స్ చేసారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతుంది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది.

హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది అని అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున పాన్ ఇండియా ఫిలిం గా విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. 

Hari Hara Veera Mallu storms into cinemas this June:

Hari Hara Veera Mallu storms into cinemas this JUNE 12th!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ