కోలీవుడ్ హీరోక జయం రవి తన భార్య ఆర్తి కి విడాకులిస్తున్నట్టుగా గత ఏడాది అనౌన్స్ చేసిన విషయం విదితమే. కానీ ఆర్తి, రవి తనని సంప్రదించకుండానే విడాకులిచ్చాడంటూ గోల గోల చేసింది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తుంది. అయితే జయం రవి కెనిషా అనే సింగర్ తో రిలేషన్ లో ఉండి భార్య ఆర్తికి విడాకులిస్తున్నాడనే ప్రచారం ఉంది.
ఈ ఏడాది రీసెంట్ గా ఓ ప్రొడ్యూసర్ కుమార్తె పెళ్ళిలో జయం రవి-కెనీషా కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ కి బలం చేకూరడం, ఆర్తి రవి పిలల్ల కోసం పోరాడుతున్నాను అంటూ జయం రవి, కెనీషాలపై ఇష్టం వచ్ఛినట్టుగా మాట్లాడింది, మరోపక్క కెనీషా కూడా ఆర్తి రవి కి కౌంటర్లు ఇస్తూ ఉంది. ఈ వ్యవహారంలో జయం రవి చాలా సైలెంట్ గా కనిపించాడు.
ఫైనల్ గా కెనీషా తో రిలేషన్ పై రవి ఓపెన్ అయ్యాడు. తాను చాలా కష్టపడి కెరీర్ ని నిర్మించుకున్నాను, నేను చట్టాన్ని నమ్ముతాను, అంతేకాని ఎమోషనల్ గా ఎవ్వరి సానుభూతి కోసం ట్రై చెయ్యను, నేను వివాహ బంధంలో ఎంతగా నలిగిపోయానో ఎవ్వరికి తెలియదు. నేను పిల్లల కోసమే బ్రతుకుతున్నాను, పిల్లల కోసం అంటూ డ్రామా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్.. వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాను, ధైర్యం చేసి ఆ బంధం నుంచి బయటికొచ్చి విడాకులు తీసుకుంటున్నాను.
ఇక కెనీషా తో నా పరిచయం స్నేహంగానే మొదలయ్యింది. నేను కట్టుబట్టలతో అర్ధరాత్రి ఇంటి నుండి బయటికొచ్చి రోడ్డుపై నిలుచున్నప్పుడు కెనీషానే నన్ను ఆదుకుంది, నాకు సపోర్ట్ గా నిలిచింది, నా పరిస్థితిని అర్ధం చేసుకుంది. ఆమె ఒక బ్యూటిఫుల్ సహచారిణి, ఆమె వృత్తి గురించి, ఆమె గురించి నీచంగా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అంటూ జయం రవి తన రిలేషన్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు.