పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ - బోయపాటి కలయిక అంటే మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్, బాక్సాఫీసు కి కాసుల గలగల, ఊర మాస్ ఆడియన్స్ కి పండగ అన్న రేంజ్ లో వారి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ మూడు చిత్రాలు వేటికవే ప్రత్యేకమైన మాస్ హిట్స్.
ఇప్పుడు అదే కాంబోలో అఖండ 2 తాండవం సెట్స్ మీద ఉంది. బాలయ్య ని అఖండ లో అఘోరాగా పవర్ ఫుల్ గా చూపించి శెభాష్ అనిపించిన బోయపాటి.. అఖండ 2 లో ఇంకెంత మాస్ గా చూపిస్తారో అనే విషయంలో ఆయన అభిమానులు చాలా క్యూరియాసిటితో కనబడుతున్నారు. ఇక సింహాలో, లెజెండ్ లో, అఖండ లో బోయపాటి బాలయ్య తో పదునైన, డిఫ్రెంట్ ఆయుధాలను పట్టించారు.
ఇప్పుడు అఖండ 2 లో కూడా బాలయ్య చేత అఖండ లో పట్టించిన త్రిసూలంని మించిన ఆయుధం పట్టించబోతున్నారట. అఖండ కు అడ్వాన్స్ వెర్షన్ ఆయుధాన్ని అఖండ 2 కోసం బోయపాటి ప్రత్యేకంగా రెడీ చేయించారని తెలుస్తుంది. అది అఖండ 2 కి హైలెట్ గా నిలుస్తుంది, ఆ ఆయుధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
మరి అదేమిటనేది జూన్ 10 బాలయ్య బర్త్ డే కి రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బాలయ్య బర్త్ డే కి అఖండ 2 నుంచి మాస్ ట్రీట్ సిద్దమవుతుంది కనుక.