బెల్లంకొండ శ్రీనివాస్ మే 30 న విడుదల కాబోతున్న భైరవం చిత్రంతో హడావిడి చేస్తాడు అనుకుంటే.. రాంగ్ రూట్ లో కానిస్టేబుల్ పైకి కారు డ్రైవ్ చేసి వార్తల్లో నిలుస్తాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. రెండురోజుల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ కార్ లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వెళ్లి హల్చల్ చేసాడు.
రాంగ్ రూట్ లో వచ్చిందే కాకుండా కార్ తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయడంతో బెల్లకొండ అక్కడినుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
బెల్లంకొండ తన ఇంటికి వెళ్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చాడని, దానితో బెల్లంకొండను అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకోవడంతో సదరు కానిస్టేబుల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించాడని బెల్లంకొండ పై కేసు నమోదు చేశారు.