ఈమధ్యన అంటే 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్యెల్యేగా గెలిచాక పిఠాపురం ఎమ్యెల్యే తాలూకా, పవన్ తాలూకా అంటూ కొన్ని వర్డ్స్ తెగ ట్రెండ్ అయ్యాయి, చాలామంది తమ బైక్స్ పై పిఠాపురం ఎమ్యెల్యే తాలూకా అంటూ రచ్చ చేసారు. ఇప్పుడు అదే ట్రెండింగ్ టైటిల్ తో హీరో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ వచ్చేసాడు.
మే 15 రామ్ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు. పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ఆంధ్ర కింగ్ తాలుకా టైటిల్ తో పాటుగా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో సినిమా థియేటర్.. టికెట్ల కోసం పలుకు బడిని వాడటం.. ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ ఇలా టికెట్లు తీసుకుంటూ ఉండటం.. ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం.. హీరో రామ్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి.. ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి చూస్తుంటే నిజంగానే ఇది పిఠాపురం ఎమ్యెల్యే తాలూకా ని ఇన్స్పైర్ అయ్యి ఈ టైటిల్ పెట్టినట్లుగా అనిపిస్తుంది.
ఆంధ్ర కింగ్ తాలూకా లో రామ్ లుక్స్ అదుర్స్. రామ్ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఈ చిత్రంలో రామ్ కి విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నాడు.