Advertisementt

స్టార్ హీరో శింబు పెళ్లి భాజాలు

Thu 15th May 2025 03:53 PM
simbu  స్టార్ హీరో శింబు పెళ్లి భాజాలు
Star hero Simbu wedding vows స్టార్ హీరో శింబు పెళ్లి భాజాలు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో శింబుకు పెళ్లి భాజాలు మోగ‌నున్నాయా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా ఇంత‌కాలం బాధ్య‌త, క్ర‌మ‌శిక్ష‌ణ‌ లేకుండా ఉన్న శింబుకు ముకుతాడు వేయాల‌ని పాపా టి.రాజేందర్ చాలా కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నా ఎందుక‌నో అత‌డికి పెళ్లి కావ‌డం లేదు. కానీ పెళ్లి ఆలోచ‌న ఉంద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో శింబు స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టాడు. చెన్నైలోని ఓ కాలేజ్ ఫంక్ష‌న్ లో అత‌డికి పెళ్లి గురించిన ప్ర‌శ్న ఎదురైంది. ఆ స‌మ‌యంలో అత‌డిని విద్యార్థులు పెళ్లెప్పుడు? వ‌ధువు ఎలా ఉండాలి? అంటూ ప్ర‌శ్నించారు.

దీంతో శింబు పెళ్లికి సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. అయితే వ‌ధువు ఎలా ఉండాలో అత‌డు అప్ప‌టికి చెప్ప‌లేదు. కానీ చాలా ఊహాగానాలు చెల‌రేగాయి. శింబు న‌టిస్తున్న తాజా చిత్రం థ‌గ్ లైఫ్ ప్ర‌మోష‌న్స్ పై దృష్టి సారించాడు. అలాగే వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ మణిర‌త్నం అత‌డిని క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన హీరోగా తీర్చిదిద్దారు. 

న‌వాబ్ మొద‌లు వ‌రుసగా మ‌ని ర‌త్నంతో క‌లిసి అత‌డు ప‌ని చేస్తున్నాడు. ప్ర‌స్తుతం థ‌గ్ లైఫ్ లో శింబు కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం మ‌రోసారి ఆడియెన్ తెర‌పై చూడబోతున్నార‌న్న టాక్ ఉంది. థ‌గ్ లైఫ్ విడుద‌ల‌య్యే లోపు శింబు పెళ్లి భాజాల గురించి క‌బురందుతుందేమో చూడాలి. 

Star hero Simbu wedding vows:

Simbu breaks silence on marriage plan

Tags:   SIMBU
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ