మే మిడిల్ లో రాజా సాబ్ టీజర్ అంటూ చిన్న హింట్ ఇస్తూ దర్శకుడు మారుతి ట్వీట్ వేశారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. రాజా సాబ్ టీజర్ మే మిడిల్ కల్లా వచ్చేస్తుంది అంటూ సంబరపడ్డారు. ప్రభాస్ కూడా ఇటలీ లో సమ్మర్ వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. మారుతి రాజా సాబ్ టీజర్ కట్ చేసారు, ప్రభాస్ డబ్బింగ్ చెబితే టీజర్ రిలీజ్ డేట్ ఇస్తారు అన్నారు.
మే మధ్యలోకి వచ్చేసాము, కానీ ఇప్పటివరకు రాజా సాబ్ ముచ్చట తియ్యడం లేదు, మారుతి నుంచి ఎలాంటి కబురు రావడం లేదు, దానితో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన స్టార్ట్ అయ్యింది, ఇప్పటికి రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ ఇవ్వకుండా పరీక్ష పెడుతున్న మారుతి టీజర్ విషయంలోనూ ఇలా చెయ్యడం వారికి అస్సలు నచ్చడం లేదు.
మారుతి కూడా నన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి అంటున్నాడు తప్ప అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని కూల్ చేద్దామనే విషయం పక్కన పెట్టడమే ప్రభాస్ ఫ్యాన్స్ లో అసహనానికి కారణం. మరి రాజా సాబ్ టీజర్ కి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో చూడాలి.