సమంత శుభం తో హిట్ కొట్టింది, నిర్మాతగా మారిన సమంత శుభం తో లాభాలు చూసిందా, లేదా అనేది పక్కనపెడితే శుభం చిత్రంతో సౌత్ లో సమంత హడావిడి చేసింది. అయితే శుభం చిత్రం తెరకెక్కడం వెనుక అజ్ఞాతశక్తి ఉన్నట్లుగా శుభం చిత్ర దర్శకుడు వంశీ బయటపెట్టాడు.
శుభం చిత్రం సెట్ లో అందరూ ఎలా ఉన్నారో చూపిస్తూ సమంత ను అలాగే టీమ్ ని ఇంకా శుభం వెనుక ఉన్నది రాజ్ నిడమోరు అంటూ దర్శకుడు వంశీ రివీల్ చెయ్యడమే కాదు, శుభం చిత్రాన్ని వీక్షించిన సమంత అందులోను రాజ్ నిడమోరు ఉన్న పిక్ పోస్ట్ చేసింది. సమంత తెరకెక్కించిన శుభం వెనుక ప్రతి విషయంలో రాజ్ నిడమోరు ఉన్నారు. సమంత వెనుక రాజ్ నిడమోరు అజ్ఞాతశక్తిలా పని చేశారనేది రివీల్ చేశారు.
మరి అందరూ అనుకుంటున్నట్టుగా సమంత నిజంగానే రాజ్ నిడమోరు తో రిలేషన్ లో ఉందా? అందుకే ఇలా విడదల వారీగా ఫొటోస్ బయట పెడుతూ హింట్ ఇస్తుందా, రాజ్ నిడమోరు ని సమంత రెండో వివాహం చేసుకుంటుందా అంటూ ఆమె అభిమానులు చాలా ఆతృతగా మాట్లాడుకుంటున్నారు.