దగ్గుబాటి రానా కొన్నేళ్ల క్రితం నరసింహస్వామి అవతారంపై సినిమా తీయాలని చాలా ప్రయత్నాలు సాగించిన సంగతి తెలిసిందే. ప్రహ్లాదుడు- హిరణ్యకశిపుని కథలో అత్యంత క్రూరమైన నరసింహావతారాన్ని తెరపై ప్రెజెంట్ చేయాలని, నరసింహస్వామిగా నటించాలని రానా కలలు కన్నాడు. నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రన్ని అత్యంత భారీగా పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కించాలని భావించారు. దీనికోసం రామానాయుడు స్టూడియోస్ లో, అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాల్లో టెక్నీషియన్లు పని చేస్తున్నారని యానిమేషన్ లో ముందస్తు విజువల్ క్రియేషన్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలిపారు.
కానీ ఏమైందో కానీ, ఈ ప్రయత్నం మధ్యలోనే అటకెక్కింది. కాస్ట్ కంట్రోల్ ఫ్యాక్టర్, క్రియేటివిటీ మ్యాటర్స్ లో ఏదో తేడా వచ్చిందని అంతా భావించారు. గుణశేఖర్ తో లొల్లి కూడా ఈ ప్రాజెక్ట్ ఆపేయడానికి కారణం. అయితే సురేష్ బాబు వదులుకున్న ప్రాజెక్టును వేరొకరు ఫ్రీగా టేకోవర్ చేసారు. ముఖ్యంగా కేజీఎఫ్, కాంతార లాంటి ప్రాజెక్టులతో సంచలనాలు సృష్టించిన హోంబలే సంస్థ దీనిని సాధ్యం చేసి చూపిస్తోంది.
అయితే ఈ సినిమా మేకింగ్ కోసం ఎక్కడా ఆర్టిస్టులతో పని లేదు. హోంబలే తెలివిగా ప్రయత్నిస్తోంది. కేవలం ఆర్టిస్టు వాయిస్ నేపథ్యంలో వినిపిస్తే చాలు. ఇది పూర్తిగా యానిమేటెడ్ సినిమా కాబట్టి. మహావతార్ నరసింహ పేరుతో థియేట్రికల్ గా కన్నడం, మలయాళం, తమిళం, తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహకాల్లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ తేదీతో మరో యానిమేటెడ్ టీజర్ విడుదల చేయగా వైరల్ గా మారుతోంది. యానిమేటెడ్ విజువల్స్ తెరపై అబ్బురపరిస్తే సినిమా హిట్టే.. లేదంటే ఫట్టే!!! రానా వదులకున్నది హోంబలే ఎన్ క్యాష్ చేస్తుందా లేదా చూడాలి.