Advertisementt

తెరపై 40 ఏళ్ళ తర్వాత రజిని-కమల్ స్నేహం

Tue 13th May 2025 12:09 PM
kamal haasan  తెరపై 40 ఏళ్ళ తర్వాత రజిని-కమల్ స్నేహం
Kamal Haasan and Rajinikanth may reunite for the silver screen తెరపై 40 ఏళ్ళ తర్వాత రజిని-కమల్ స్నేహం
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్-కమల్ హాసన్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటి స్నేహాన్ని ఈతరం ఆడియన్స్ వెండితెరపై చూడాలనేది అభిమానుల ఆత్రుత, ఆరాటం. కానీ రజిని, కమల్ కలిసి వెండితెరపై కనిపించి దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది. కమల్-రజిని కలిసి కనిపిస్తే చూడాలని అభిమానుల కోరికను ఇప్పుడొక కుర్ర డైరెక్టర్ తీర్చబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. . 

ఆ కోరికను కుర్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీర్చేలా కనిపిస్తున్నాడు. అనుకోని, అద్భుతమైన, అదిరిపోయే కాంబినేషన్స్ ను సెట్ చేసే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ తో కూలి మూవీ చేస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రజిని-కమల్ కోసం లోకేష్ ఒక కథ అనుకున్నాడట. 

వ‌య‌సు పైబ‌డిన ఇద్ద‌రు గ్యాంగ్ స్ట‌ర్స్ గా రజిని-కమల్ కోసం కథను పేపర్ చేస్తున్నాడట. గ్యాంగ్ స్ట‌ర్స్ రిటైర్ అయిపోయిన త‌ర‌వాత వీరిద్ద‌రూ క‌ల‌సి ఏం చేశార‌న్న‌ది కాన్సెప్ట్. ర‌జ‌నీ, క‌మ‌ల్.. వ‌య‌సుకు త‌గిన పాత్ర‌లు చేస్తే లోకేష్ ఐడియా కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. మరి విక్రమ్ తో కమల్ ని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజినీకాంత్ తో కూలి చేస్తున్నాడు. 

సో గ్యాంగ్ స్టార్స్ కథ తో ఇద్దరినీ అప్రోచ్ అయితే వారు కచ్చితంగా ఓకె చేస్తారు. నిజంగా రజిని, కమల్ కలిసి సినిమా చేస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే. చూద్దాం సూపర్ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది. 

Kamal Haasan and Rajinikanth may reunite for the silver screen:

Kamal Haasan and Rajinikanth may reunite for the silver screen after as long as 40 years 

Tags:   KAMAL HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ