Advertisementt

త‌ల్లి భార్య‌కు చెప్ప‌కుండా ఇల్లు కూల్చాడు

Sun 11th May 2025 09:15 AM
santhanam  త‌ల్లి భార్య‌కు చెప్ప‌కుండా ఇల్లు కూల్చాడు
Santhanam reveals shocking facts త‌ల్లి భార్య‌కు చెప్ప‌కుండా ఇల్లు కూల్చాడు
Advertisement
Ads by CJ

సంతానం న‌టించిన `డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా ఆడియో వేడుక‌లో ఒక హీరో కార‌ణంగా తన ఇల్లును కూల్చాల్సి వ‌చ్చింద‌ని సంతానం గుర్తు చేసుకున్నాడు. ఒక స్క్రిప్టు గురించి త‌న‌తో మాట్లాడేందుకు వ‌చ్చిన హీరో ఆర్య త‌న ఇల్లు పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గ‌కుండా ఆపేసాడ‌ని, ఆ ఇంటిని వెంట‌నే ప‌డ‌గొట్టించాడ‌ని సంతానం ఆరోపించాడు. తాను ఇల్లు ప‌డ‌గొట్టించిన విష‌యం త‌న భార్య‌, త‌ల్లికి కూడా తెలియ‌ద‌ని చెప్పి షాకిచ్చాడు.

 

ఆర్య త‌న ఇంటిని సంద‌ర్శించిన ఒక గంట‌లోనే ఒక నిపుణుడైన ఇల్లు కూల్చే వ్య‌క్తి వచ్చాడ‌ని, ఆ త‌ర్వాత నాలుగు రోజుల్లోనే ఇల్లు మొత్తం కూల్చి, అక్క‌డ కేవ‌లం ఖాళీ నివేశ‌న స్థ‌లాన్ని మాత్ర‌మే మిగిల్చార‌ని సంతానం చెప్పాడు. అయితే ఆ ఇంటితో త‌న త‌ల్లి, భార్య‌కు ఎంతో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ ఉంద‌ని, ప్ర‌తి శుక్ర‌వారం ఆ ఇంటిలోనే పూజా కార్య‌క్ర‌మాలు చేస్తార‌ని కూడా వివ‌రించాడు. చివ‌రికి శుక్ర‌వారం నాడు వ‌చ్చిన త‌న త‌ల్లి, భార్య‌కు అక్క‌డ ఇల్లు లేక‌పోవ‌డంతో ఏం జ‌రిగిందో అర్థం కాలేద‌ని చెప్పాడు. ఆ త‌రవాత ఆర్య స్వ‌యంగా ఆ ఇద్ద‌రితో మాట్లాడి క‌న్విన్స్ చేసాడు.

 

అయితే ఈ ఎపిసోడ్ లో త‌న స్నేహితుడు ఆర్య వ‌ల్ల కొన్ని చిక్కులు ఉన్నా కానీ, జీవితంలో చాలా ధైర్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని సంతానం చెప్పాడు. కొనుగోలు చేసిన పాత‌ ఇల్లు సరిపోదని ఆర్య పట్టుబట్టి, దానిని కూల్చివేసి కొత్తగా ప్రారంభించమని కోరాడు. సంతానం మొదట్లో ప్రతిఘటించాడు. తన కుటుంబం ఆ ఇంటితో ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌యి ఉంద‌ని చెప్పాడు. అదనపు ఖర్చులు పెరుగుతాయని భ‌య‌పడ్డాడు. కానీ ఆర్య అత‌డి మాట విన‌లేదు. ఇల్లు ప‌డ‌గొట్టించాడు. అయితే త‌న కుమారుడి ఆక‌స్మిక నిర్ణ‌యాన్ని సంతానం త‌ల్లి ముందే గ్ర‌హించ‌లేక‌పోయింది. పాత త‌రం ఇంటి స్థానంలో అధునాత‌న వ‌స‌తుల‌తో ఇల్లు నిర్మించాన‌ని తెలిపాడు.

Santhanam reveals shocking facts :

  Santhanam reveals shocking facts at Devil Double Next Level audio launch  

Tags:   SANTHANAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ