బాలీవుడ్ నటి కంగనా రనౌత్ `బ్లెస్డ్ బి ది ఈవిల్` చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. కంగన మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రమింది. అనురాగ్ రుద్ర కంగక కోసమే ప్రత్యేకంగా సిద్దం చేసిన స్క్రిప్ట్ ఇది. ఆమె మాత్రమే పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఎంపిక చేసాడు. అతింద్రీయ శక్తులు-జానపద కథల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది.
గర్భస్రావం తర్వాత బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న జంటను దుష్టశక్తి నుంచి ఎలా బయట పడింది? అన్నది అంతర్లీనంగా హైలైట్ అవుతుంది. ఈ చిత్రాన్ని న్యూయార్క్ లో ప్రారంభించడానికి రెడీ అవుతు న్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ను కంగన అప్రోచ్ అయిం దిట. ఆ పాత్రలో పీసీ నటిస్తే బాగుంటుంది? అన్న ఉద్దేశంతో న్యూయార్క్ లో అమెను కలిసి మాట్లాడిం దిట.
కానీ ప్రియాంక చోప్రా మాత్రం సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. తన షెడ్యూల్ బిజీగా ఉండ టంతో ఇప్పట్లో డేట్లు ఇవ్వలేనని... డేట్లు కావాలంటే ఏడాది పాటు వెయిట్ చేయాల్సి ఉంటుందని తెలి పిందిట. దీంతో కంగన మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కంగనకు ఊహించని సమాధానం పీసీ నుంచి వచ్చింది. అడిగి భంగపడినట్లు అయింది. మరి పీసీ నిజంగా డేట్లు సర్దుబాటు చేయలేక తిరస్కరించిందా? లేక కంగన చిత్రంలో తాను నటించడం ఏంటని భావించిందా? అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఎస్ ఎస్ ఎంబీ 29లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లో కూడా జాయిన్ అయింది. దీనిలో భాగంగా కొన్ని రోజుల పాటు హైదరాబాద్, భువనేశ్వర్ లోనే ఉంది. కొత్త షెడ్యూల్ జూన్ నుంచి మొదలవుతుంది. మళ్లీ పీసీ కనిపించేది అప్పుడే .