ఆకాష్ పూరి అవకాశం కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా సమర్దుడే అయినా అవకాశాలు అందుకోవడంలో మాత్రం వెనుకబడే ఉన్నాడు. చివరిగా రిలీజ్ అయిన `చోర్ బజార్` తోనూ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాడు. దీంతో కొత్త అవకాశాలు మరింత కఠినంగా మారాయి. వెనుక పూరి అనే బ్రాండ్ ఇమేజ్ ఉన్నా? ఆ ఇమేజ్ ను వాడుకోకుండా అవకాశాలు దక్కించుకోవాలి అన్నది ఆకాష్ నియ మం.
డాడ్ పెట్టిన రూల్ ని బ్రేక్ చేయడానికి లేదు. ఆ కారణంగానూ ఆకాష్ రేసులో వెనుకబడుతున్నాడు. డాడ్ తరహాలో కష్టే ఫలి అనే మాటని నమ్మి ముందుకెళ్తున్నాడు. కెరీర్ టర్నింగ్ ఛాన్స్ రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడా ఛాన్స్ డాడ్ రూపంలో వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఓ సినిమాకు రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పూరి సొంత బ్యానర్లోనే ఛార్మీ సహకారంతో స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు ఆకాష్ ని తీసుకున్నట్లు సమాచారం. ఆ రోల్ హీరో పాత్రకు ధీటుగా ఉంటుందంటున్నారు. పాత్రలో కాస్త నెగిటివిటీ కోణం కూడా హైలైట్ అవుతుందిట.
ఈ సినిమా తర్వాత ఆకాష్ ఐడెంటిటీనే మారిపతుందంటున్నారు. మరి ఈ ప్రచారమంతా నిజమా? కాదా? అన్నది మేకర్స్ ధృవీకరించాలి. పూరి దర్శక త్వంలో ఆకాష్ ఇప్పటికే `మెహబూబా`చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. ఇండియా -పాకిస్తాన్ జంట ప్రేమికుల కథగా దీన్ని తీర్చిదిద్దాడు. సినిమా మంచి హైప్ తో రిలీజ్ అయిన ఆశించిన ఫలితాలు సాధించలేదు.