కొన్నాళ్లుగా వినిపించని డింపుల్ హయ్యతి పేరు ఈమధ్యన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వరస డిజాస్టర్స్ మాత్రమే కాదు, ఆమె రియల్ లైఫ్ లోను ఓ ఇన్సిడెంట్ తో మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. అంతేకాదు డింపుల్ హయ్యతి ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఆధ్వర్యంలో స్పెషల్ పూజలు కూడా తన ఫ్లాట్ లోనే చేయించుకున్న విషయం కూడా బయటకు లీక్ అయ్యింది.
కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న డింపుల్ హయ్యతి కి ఫైనల్ గా టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు అవకాశమిచ్చారు. ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్. శర్వానంద్ భోగి చిత్రంలో ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అయితే మరో హీరోయిన్ గా డింపుల్ హయ్యాతి ని ఫైనల్ చేసి రివీల్ చేసారు. ఇక అవకాశాలు లేక కామ్ గా ఉన్న డింపుల్ హయ్యతి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది.
ఎక్కువగా ఫిట్ నెస్ వీడియోస్ లో కనిపించే డింపుల్ ఇప్పుడు డాన్స్ వీడియోలో పిక్ కట్ చేసి ఈ ఫోటో వర్కౌట్ సమయంలో తీసుకున్నదా లేక డాన్స్ ప్రాక్టీస్ సమయంలో తీసుకున్నదా అని మీరు ఊహించగలరా? అంటూ పజిల్ పెట్టింది, ఆతర్వాత ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆ వీడియో ని వదిలింది. అది చూసి అవకాశం రాగానే హడావిడి మొదలు పెట్టింది డింపుల్ హయ్యతి అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.