కోలీవుడ్ బ్యూటిఫుల్ జంట జయంరవి-ఆర్తి లు విడాకులు తీసుకోబోతున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో రవి-ఆర్తి విడాకుల కేసు ప్రాసెస్ లో ఉంది. అయితే ఈ విడాకుల కేసులో ఆర్తి రవి, జయం రవిల వెర్షన్స్ వేరు వేరుగా ఉన్నాయి. ఆర్తి మాత్రం జయం రవితో విడిపోయేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపనప్పటికీ.. 18 ఏళ్ళ వైవాహిక జీవితంలో తను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నా బాధ ఎవ్వరికి తెలియదు అని జయం రవి చెబుతున్నాడు
అయితే జయం రవి వేరే అమ్మాయి తో రిలేషన్ లో ఉన్నాడని, అందుకే భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నాడని ప్రచారానికి ఊతమిస్తూ రెండురోజుల క్రితం చెన్నై లో ఓ ప్రొడ్యూసర్ కుమార్తె పెళ్లి కి జయం రవి తో కలిసి రూమర్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ కెనిష కనిపించడం పై ఆర్తి రవి రియాక్ట్ అయ్యింది. తాను రవి తో ఇంకా విడాకులు తీసుకోలేదు, పిల్లల కోసం అన్ని భరిస్తున్నాను, నాకు రవి దగ్గర నుంచి ఎలాంటి అర్ధక సహాయం అందడం లేదు. 18 ఏళ్ల పాటు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేసాడు.
ఫోన్ లిఫ్ట్ చేయకుండా, అవసరాలకు స్పందించకుండా, మెసేజెస్ కి రిప్లై ఇవ్వ్వకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. కొన్ని నెలలుగా పిల్లల బాధ్యత నాదే. రవి నాకు ఎలాంటి సపోర్ట్ చెయ్యడం లేదు, ఆర్థికంగానూ, నైతికంగాను ఎలాంటి సపోర్ట్ లేదు. ప్రేమ విషయంలో బాధపడడం లేదు. కానీ పిల్లల విషయంలోనే బాధ. నేను ఈరోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా, పిల్లల కోసం పోరాడే తల్లిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీరంతా చూసారు, ప్రపంచం అంతా చూసింది వారిని, వారు (రవి-కెనిష) కలిసే ఉన్నారు.
తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల కేసులో చివరి తీర్పు వరకు నా ఇన్స్టా అకౌంట్ లో ఆర్తి రవి అనే పేరు మార్చను. నేను ఏడవడం లేదు, అరవడం లేదు. నాన్న అని పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డాను అటూ ఆర్తి రవి కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.