స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది, అలాగే తన క్రేజ్ పెంచుకుంది. అంతేకాదు అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టిన సమంత కు స్పెషల్ స్టేటస్ వచ్చింది. కానీ నాగ చైతన్య తో విడాకులు తీసుకుని అనారోగ్యం బారిన పడి నటనకు బ్రేకిచ్చింది. అందులోను సౌత్ సినిమాలకు పెద్ద బ్రేకే ఇచ్చింది.
మళ్ళీ నటిగానే సౌత్ కి కమ్ బ్యాక్ ఇస్తుంది అనుకుంటే ఆమె నిర్మాతగా తిరిగొచ్చింది. శుభం అంటూ కొత్త నటులతో సినిమా చేసి రిలీజ్ చేసింది. తన స్టామినాతో ఓన్ గా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమే కాదు, శుభం కంటెంట్ పై నమ్మకంతో ప్రీమియర్స్ ప్లాన్ చేసింది. ప్రీమియర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యి శుభం చిత్రానికి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
కానీ శుభం విడుదలైన రోజు చాలా చోట్ల థియేటర్స్ ఫుల్ అవ్వలేదు, కొన్ని చోట్ల శుభం చిత్రం తీసుకున్న థియేటర్ యజమానులు ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్ చెయ్యడం చూసిన వారు సమంత ను హీరోయిన్ గా ఆదరించారు, కానీ నిర్మాతగా నమ్మలేదు. అందుకే శుభం చిత్రానికి మొదటిరోజు పూర్ ఓపెనింగ్స్ పడ్డాయని మాట్లాడుకుంటున్నారు.
థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయితే తప్ప చిన్న సినిమాలైనా,పెద్ద సినిమాలైన దేనినైనా ఆడియన్స్ ఆదరించడమేలేదు. అందుకే శుభం వైపు ప్రేక్షకులు కన్నెత్తి చూడలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.