ఏప్రిల్ 22 న నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సెట్ లోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత 14 రోజులు గా కర్ణాటక సమీపంలోని బెంగుళూరు కు అతి దగ్గరలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. సముద్ర తీరాన ఎన్టీఆర్-నీల్ షూటింగ్ జరుగుతుంది. రెండురోజుల క్రితం బీచ్ లో ఎన్టీఆర్-నీల్ తమ టీమ్ తో కలిసి సరదాగా ఆడిన క్రికెట్ వీడియో వైరల్ గా మారింది.
ఇక ఎన్టీఆర్ బెంగుళూరు డ్రాగన్ షెడ్యూల్ ముగించుకుని నిన్న మంగళవారం ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ వీడియో చూసి ఎన్టీఆర్ మరింతగా చిక్కినట్టుగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు. లుక్ విషయంలో కాస్త విమర్శలు ఎదుర్కున్నారు.
ఇక డ్రాగన్ కర్ణాటక షెడ్యూల్ ముగియడంతో.. కొద్దిరోజుల గ్యాప్ లో ప్రశాంత్ నీల్ హైదేరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రెడీ అవుతున్న ఓ భారీ సెట్ లో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుంది అనే ప్రచారం ఉంది.