కాంతార చిత్రంతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా మార్కెట్ లో సంచలనాలు నమోదు చేసారు. చిన్న చిత్రమే పెద్ద విజయం సాధించడంతో దీనిని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇపుడు కాంతార చాప్టర్ 2 కి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ని భారీ గా తెరకెక్కిస్తున్నారు.
అయితే కాంతారా 1 షూటింగ్ లో ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతూ టీమ్ ని కలవరపెడుతూనే ఉంది. కొద్ధి నెలల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడి పలువురు జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత కాంతార పార్ట్ 1 కోసం వేసిన భారీ సెట్ గాలివానకు పాడైపోయి కొన్ని కోట్ల నష్టం వాటిల్లేలా చేసింది.
ఇప్పుడు కాంతార 1 టీమ్ లోని కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు నీళ్లలో మునిగి మృతి చెందడం కలకలం సృష్టించింది. కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి చేసుకుని తన స్నేహితులతో కలిసి కపిల్ కొల్లూరు లోని సౌపర్ణిక నదిలోకి ఈతకు వెళ్లగా అక్కడ నది లోతు తెలియక కపిల్ నీటిలో మునిగి చనిపోయినట్లుగా తెలుస్తుంది.
ఈ ప్రమాదంతో కాంతార టీమ్ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 షూటింగ్ ఉడిపి జిల్లా దగ్గరలో చిత్రీకరణ జరుపుకుంటుంది.