Advertisementt

సెలబ్రిటీస్ కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Wed 07th May 2025 03:07 PM
pawan kalyan  సెలబ్రిటీస్ కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
Pawan strong warning to celebrities సెలబ్రిటీస్ కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Ads by CJ

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట ఇండియా ఆర్మీ విజయవంతంగా దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పహల్గామ్‌ దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడిని ప్రతి ఒక్కరు హర్షించాలి. మూడు ఉగ్రవాద సంస్థలపై దాడి జరిగింది. హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. ప్రధాని నేతృత్వంలో దీటైన జవాబు ఇచ్చాం. ప్రధానికి మనమంతా అండగా ఉందాం.. అన్నారు. 

అంతేకాకుండా సోషల్ మీడియాలో భరత్ కి వ్యతిరేఖంగా పోస్ట్ లు పెట్టేవారికి, పిచ్చాపాటి ట్వీట్లు చేస్తూ హైలెట్ అయ్యే సెలబ్రిటీస్ కి, ఇష్టం వచ్చిన వీడియోస్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లు కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు, దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు, ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. 

Pawan strong warning to celebrities:

Operation Sindoor: Pawan Kalyan issues warning to celebrities

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ