Advertisementt

బాలయ్య - క్రిష్ కాంబో వన్స్ మోర్

Tue 06th May 2025 01:30 PM
balakrishna  బాలయ్య - క్రిష్ కాంబో వన్స్ మోర్
Balayya - Krish Combo Once More బాలయ్య - క్రిష్ కాంబో వన్స్ మోర్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకుని ప్రస్తుతం హిందుపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలో బాలకృష్ణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 తాండవం చిత్రం షూటింగ్ చేస్తున్నారు. 

దీని తర్వాత బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని తో సినిమా చెయ్యబోతున్నారనే టాక్ ఉంది. ఈలోపు అనూహ్యంగా బాలయ్య తదుపరి మూవీ లైన్ లోకి దర్శకుడు క్రిష్ వచ్చారు. బాలయ్య తో గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయో పిక్ చిత్రాలు తెరకెక్కించిన క్రిష్ తో బాలకృష్ణ మరోసారి కమిట్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

క్రిష్, పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుంచి తప్పుకుని అనుష్క ఘాటీ ని తెరకెక్కించి విడుదలకు రెడీ చేస్తున్నారు. తాజాగా బాలయ్య క్రిష్ తో మూవీ కి ఓకె  చెప్పారని, అది ఆదిత్య 369కి సీక్వెల్ గా ఉండబోతుంది అని, దాని ద్వారానే బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ని ప్లాన్ చేసారని చెప్పుకుంటున్నారు. 

అటు బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ కథ రాసుకుని తనే డైరెక్ట్ చెయ్యాలనే కోరిక వెలిబుచ్చారు, మరోపక్క మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కూడా ఆగిపోయింది అనే వార్తల నేపథ్యంలో బాలయ్య-క్రిష్ కాంబో మూవీలో మోక్షజ్ఞ తెరంగేట్రం అనే న్యూస్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Balayya - Krish Combo Once More:

Balakrishna - Krish Combo on cards

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ