హీరోగా 100కోట్లు సాధిస్తే ఆ హీరో రేంజ్ పెరుగుతుంది. అదే నిర్మాతగా 100 కోట్లు అంటే అతనికి బోలేడన్ని లాభాలు. హీరో కం ప్రొడ్యూసర్ 100 కోట్లు కొల్లగొడితే అది మాములు విషయం కాదు. ఆ రేర్ ఫీటని హీరో నాని సాధించాడు. మొన్నటికి మొన్న కోర్టు చిత్రంతో నాని నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అంటూ ఛాలెంజ్ చేసాడు.
కోర్టు తో నిర్మాతగా హిట్ అందుకున్న నాని, ఇప్పుడు రెండు నెలలు తిరక్కుండానే హిట్ 3 చిత్రంతో నిర్మాతగానూ, హీరోగానూ 100 కోట్ల క్లబ్బులోకి సునాయాసంగా అంటే మొదటి వీకెండ్ గడిచేలోపే అడుగుపెట్టాడు. ఈ విధంగా నాని నిర్మాతగా, అటు హీరోగా రేర్ ఫీట్ అందుకున్నాడనే చెప్పాలి.
అందులోను కొన్నేళ్లగా నాని జెడ్జిమెంట్ కి ఎదురు లేకుండా పోయింది. నాని సినిమా అంటే నిర్మాతలు సేఫ్, నిర్మాతలేనా నాని కూడా సేఫ్ అన్న రేంజ్ లో హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. దసరాకు ముందు నుంచి, ఆ తర్వాత హాయ్ నాన్నా, సరిపోదా శనివారం, హిట్ 3 ఇలా వరసగా నాని అద్భుతమైన హిట్లు కొడుతున్నాడు.