దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఓదెల 2 చిత్రం గత నెల ఏప్రిల్ లో విడుదలైంది. ఈ చిత్రానికి అటు ఆడియన్స్ నుండి ఇటు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తమన్నా తన కేరెక్టర్ కి న్యాయం చేసినా ఆశించిన స్థాయిలో ఓదెల 2 కి కలెక్షన్స్ రాలేదు.
దానితో ఇప్పడు ఓదెల 2 నెల తిరిగేలోపే ఓటీటీ లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తుంది. ఓదెల 2 ఓటీటీ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో ఆమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే అమెజాన్ ప్రైమ్ వారు థియేటర్స్ లో విజయం సాధించలేకపోయిన ఓదెల 2 ను ఓటీటీ లో స్ట్రీమింగ్ కి తెచ్చేందుకు రెడీ అయ్యారట.
మే 17 నుంచి ఓదెల 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది, త్వరలోనే మే 17 నుంచి ఓదెల 2 స్ట్రీమింగ్ అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు.