రామ్ చరణ్, మహేష్ చిత్రాల ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాది గేమ్ చేంజర్ తో హిట్ కొట్టాలని ఆశపడింది. కానీ దర్శకుడు శంకర్ మాత్రం కియారా ఆశ నెరవేరకుండా చేసారు. ఇక హిందీ వార్ 2 లోను అలాగే కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రాల్లో హీరోయిన్ గా కియారా నటిస్తుంది.
ఈలోపే ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆమె భర్త హీరో సిద్దార్థ్ మల్హోత్రా రివీల్ చేసారు. సిద్దార్థ్ తో డేటింగ్ చేసి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న కియారా పెళ్లైన రెండేళ్లకు ప్రెగ్నెంట్ అయ్యింది. ఆతర్వాత ఆమె యష్ టాక్సిక్ ని త్వరగా పూర్తి చేసే పనిలో పడింది, అటు వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరోపక్క ఆమె ప్రెగ్నెంట్ అవడంతో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పటివరకు కియారా బేబీ బంప్ తో పెద్దగా కనిపించలేదు. తాజాగా కియారా అద్వానీ బేబీ బంప్ తో చేయించుకున్న గ్లామర్ ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె ఓ ఫ్యాషన్ షో కోసం రెడీ అయ్యి బేబీ బంప్ తో షైన్ అవుతూ కనిపించింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ గ్లో కియారా మోహంలో చాలా స్పష్టంగా కనిపించింది.