మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ లండన్ లో ప్రత్యక్షమైంది. అయితే ఈ పర్యటన వెనక అసలు రీజన్ ఏమిటి? అంటే.. అది కచ్ఛితంగా రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ కోసమేనని అభిమానులు చెప్పగలరు. ప్రతిష్ఠాత్మక లండన్ మ్యాడమ్ తుస్సాడ్స్ లో చరణ్ వ్యాక్స్ స్టాట్యూని మే9న ప్రారంభించాల్సి ఉండగా, చరణ్, చిరు, సురేఖ, ఉపాసన లండన్ లో అడుగుపెట్టారు. వీరితో పాటు పెంపుడు కుక్క రైమ్ కూడా లండన్ వెళ్లడం విశేషం..
ఆసక్తికరంగా తుస్సాడ్స్ మ్యూజియంలోని చరణ్ విగ్రహంలో రైమ్ కూడా ఒక భాగం. గత అక్టోబర్ లో చరణ్ కొలతలతో పాటు, రైమ్ కొలతల్ని కూడా తుస్సాడ్స్ నిర్వాహకులు తీసుకున్నారు. విగ్రహం రెడీ.. లాంచింగ్ ఘనంగా జరగనుంది. అందువల్ల రైమ్ కూడా లండన్ లో అడుగుపెట్టింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మెగా కుటుంబంలో కీలక వ్యక్తులంతా లండన్ లో ఉన్నారు. ఈ వార్త విన్న అభిమానుల్లోను చాలా ఉత్సాహం నెలకొంది.
మే 9న విగ్రహావిష్కరణ అనంతరం లండన్ రాయల్ ఆల్బర్ట్స్ లోని కాన్సెర్ట్ (ఆర్.ఆర్.ఆర్ థీమ్) లో మెగా ఫ్యామిలీ పాల్గొంటుంది. వారం పాటు మెగా పర్యటన సాగుతుందని సమాచారం. ఇక క్వీన్ ఎలిజబెత్ -11 తర్వాత లండన్ తుస్సాడ్స్ మ్యూజియంలో పెట్ తో పాటు కనిపించే ఏకైక విగ్రహం రామ్ చరణ్ ది మాత్రమే.