కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనని ఎలాగైనా అరెస్టు చేస్తారనే భయంతో ఎవ్వరికి కనబడకుండా హైదరాబాద్ లో సీక్రెట్ గా నివాసముంటున్న వల్లభనేని వంశీ ని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో హైదరాబాద్ లోనే వంశీని అరెస్ట్ చేసి విజయవాడ కోర్టుకి తరలించారు. ఆ కేసు తో పాటుగా వంశీ పై టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు కూడా ఉండడంతో రెండు కేసుల్లో వంశీ పలు మార్లు బెయిల్ కోసం అప్లై చేస్తున్నాడు.
కానీ కోర్టు వల్లభనేని వంశీ కి బెయిల్ ఇవ్వకుండా తిప్పలు పెడుతుంది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వల్లభనేని వంశీకి ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ కోర్టు. వంశీతోపాటు మిగిలిన నిందితుల రిమాండ్ ను కూడా పొడిగించింది. వంశీ కేసులో ఆయనకు పదే పదే బెయిల్ రిజెక్ట్ అవుతుంది.
రీసెంట్ గా వల్లభనేని వంశీ జైల్లో అస్వస్థతకు గురికావడంతో ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించి మళ్లీ జైలుకు తరలించారు అధికారులు.