Advertisementt

చిరు-రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే

Mon 05th May 2025 02:35 PM
chiranjeevi  చిరు-రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే
Chiranjeevi-Anil Ravipudi combo shooting update చిరు-రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదల తేదీ ఇస్తే.. ఇక చిరు అనిల్ రావిపూడి మూవీ సెట్ మీదికి వెళ్తారని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ దర్శకుడు వసిష్ఠ మాత్రం విశ్వంభర రిలీజ్ తేదీ విషయంలో ఇంకా నాన్చుతూనే ఉండడంతో అనిల్ రావిపూడి-చిరు మూవీ లేట్ అవుతుందేమో అనేది వారి భయం. 

అయితే విశ్వంభర విషయం ఎలా ఉన్నా ఇప్పుడు చిరు, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యేందుకు సిద్దమవుతున్నారట. అనిల్ రావిపూడి చిరు తో చెయ్యబోయే మూవీ ఓపెనింగ్ వీడియో తోనే అందరి చూపు చిరు ప్రాజెక్ట్ పైకి వెళ్లేలా చేసారు. ఇక చిరు తో సెట్ మీదకి వెళ్ళాక అనిల్ రావిపూడి ఇంకెన్ని చిత్రాలు చూపిస్తాడో అని మెగా ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. 

చిరు-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మే 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళుతుంది అని తెలుస్తుంది. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నటించేందుకు అనిల్ రావిపూడి కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదిస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. చిరు-అనిల్ ప్రాజెక్ట్ సంక్రాంతి టార్గెట్ గా మొదలు కాబోతుంది. 

Chiranjeevi-Anil Ravipudi combo shooting update :

Chiranjeevi-Anil Ravipudi combo update

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ