Advertisementt

కింగ్ డమ్ కి కష్టాలు తప్పవా

Mon 05th May 2025 01:57 PM
kingdom  కింగ్ డమ్ కి కష్టాలు తప్పవా
Pawan Kalyans Hari Hara Veera Mallu Eyes May 30 Release కింగ్ డమ్ కి కష్టాలు తప్పవా
Advertisement
Ads by CJ

వీరమల్లు బరిలోకి దిగాడు, అంటే హరి హర వీర మల్లు రాక మే చివరిలో ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అయినట్లే. మే 9 నుంచి హరి హర వీరమల్లు మే 30 కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ నిజం చేసేలా ఉన్నారు. అదే నిజమైతే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కి కష్టాలు తప్పవు.

అసలే లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్స్ తో క్రేజ్ తగ్గిన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పాన్ ఇండియా ఫిలిం పై ఆశలు పెట్టుకున్నారు. కింగ్ డమ్ మే 30 న రిలీజ్ అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. దానితో కింగ్ డమ్ పై అంచనాలు మొదలైన సమయంలో హరి హర వీరమల్లు ఎంట్రీ కింగ్ డమ్ కి సమస్యగా మారింది.

రెండు రోజుల షూటింగ్ ని పవన్ ఫినిష్ చెయ్యడమే తరువాయి.. హరి హర వీర మల్లు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేసి ఎంత వీలయితే అంత తొందరగా వీరమల్లు ను బయటపడేయ్యాలని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. అది మే 30 అయితే బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరి వీరమల్లు మే 30 అంటే కింగ్ డమ్ మరో తేదీ చూసుకోవాల్సిందే అనేది విశ్లేషకుల మాట. 

Pawan Kalyans Hari Hara Veera Mallu Eyes May 30 Release:

Should the Vijay Devarakonda Kingdom be postponed?

Tags:   KINGDOM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ