ఏ సౌత్ హీరోయిన్ కైనా బాలీవుడ్ అవకాశాలు వస్తే అస్సలు వదులుకోరు. టాలీవుడ్ లో వరస ప్లాప్స్ తో ఉన్న శ్రీలీల కి బాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి హిందీ చిత్ర సీమలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా బాలీవుడ్ లో ఓ మంచి అవకాశం వచ్చింది అని తెలుస్తుంది.
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తో భారీ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరికి.. హిందీలో దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. స్త్రీ, మిమీ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత తెరకెక్కించే ప్రాజెక్ట్ లో మీనాక్షి చౌదరికి ఓ కీ రోల్ పోషించే ఆఫర్ వచ్చినట్లుగా సన్నిహితుల సమాచారం.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండబోతుంది, మీనాక్షి హైట్, అలాగే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి తగిన హీరోను కూడా ఆ నిర్మాణ సంస్థ వెతికే పనిలో ఉందట. త్వరలోనే మీనాక్షి హిందీ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.