వెనకటికి ఒక పారిశ్రామిక వేత్త రోజంతా పెళ్లాం మొహాన్నే చూస్తూ కూచోలేం కదా! డ్యూటీకి వెళ్లడమే మంచిది అన్నాడు! ఇటీవల పని గంటలు పెంచాలని సూత్రీకరించిన వ్యాపార దిగ్గజంపై నెటిజనులు విరుచుకుపడ్డారు. భార్యల గురించి, వారితో సమయం గడపడం గురించి పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల డిబేట్ లోకి రావడం ఆశ్చర్యపరిచింది. అదంతా సరే కానీ.. రెగ్యులర్ గా సినిమా షూటింగులు, యాడ్ షూట్లు, షికార్లు అంటూ బిజీగా ఉండే స్టార్ హీరోల భార్యల సన్నివేశం ఎలా ఉంటుంది? .. దీనికి సమాధానం కావాలంటే ఒకసారి బాలీవుడ్ స్టార్ వైవ్స్ లైఫ్ స్టైల్ చూడాలి. అక్కడ అన్నీ విడాకులతో కూలిన కాపురాలే దర్శనమిస్తున్నాయి. కొందరు కలిసి ఉన్నట్టు నటించినా ఇద్దరి మధ్యా ఏదీ లేదన్న గుసగుసలు వినిపిస్తాయి. ఈ టైప్ కేసులన్నీ చివరకు విడాకుల దశకు చేరుకుంటున్నాయి.
అదంతా సరే కానీ, ఇప్పుడు ప్రముఖ స్టార్ హీరో సతీమణి తాను పెళ్లయ్యాక ఒంటరిని అయ్యానని కలత చెందింది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు చాలా చిన్న వయసు(20)లోనే పెళ్లయిందని, దాని పర్యవసానంతో కాలేజ్ లు, ఉద్యోగ వేట, లక్ష్యాలు, ఔటింగులు అంటూ లేకుండా పోయాయని, స్వేచ్ఛా విహారానికి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన చెందింది. చివరికి స్నేహితులు కూడా తనకు దూరమైపోయారని, వారంతా షికార్లు , సినిమాలు వినోదం అంటూ తిరుగుతుంటే తనకు అలాంటి ఆనందాలు లేకుండా పోయాయని చెప్పింది. స్నేహితులు దూరమైపోవడంతో తాను ఒంటరిని అయ్యాననే ఫీలింగ్ తో ఉండేదానిని అని కూడా అంగీకరించింది.
మొత్తానికి ఒంటరితనం ఫీలింగ్ నుంచి బయటపడటానికి తాను ఏం చేసేదో చెప్పలేదు. పెద్ద స్టార్ కి భార్య అయ్యాక, అతడితో అన్నీ బాగానే ఉన్నా కానీ ఏదో లోటు వెంటాడిందని అంగీకరించింది. తాను ఎదుర్కొన్న ఒంటరితనం గురించి బహిరంగంగా వాపోవడం కూడా ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఈ స్టార్ వైఫ్ ఎవరు? అన్నది అప్రస్తుతం. ఆమె ఒంటరితనం ఫీలింగ్ ఒక్కటే ఇక్కడ డిబేటబుల్ థింగ్!