సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తను తెలుగు వాడైనందుకు తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చెయ్యకుండా అడ్డుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రవితేజ కు కెరీర్ లో సూపర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని కి బాలయ్య తో చేసిన వీర సింహ రెడ్డి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
వీర సింహ రెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ జాట్ సినిమా తెరకెక్కించారు. ఆ చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో గోపీచంద్ మలినేని రేంజ్ మరింతగా పెరిగింది. అంతేకాకుండా మైత్రి మూవీస్ వారు జాట్ హిందీలో సక్సెస్ అవడంతో దానికి సీక్వెల్ కూడా ప్రకటించారు.
అయితే బాలయ్య తో వీర సింహ రెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని కోలీవుడ్ హీరో విజయ్ తో సినిమా చెయ్యాలని ట్రై చెయ్యడమే కాదు విజయ్ ని కలిసి కథ చెప్పి సింగిల్ సిట్టింగ్ లోనే ఓకె చేయించుకున్నారట. ఆతర్వాత విజయ్ రాజకీయ పార్టీ ఎనౌన్స్ చెయ్యడంతో, ఇలాంటి సమయంలో తెలుగు దర్శకుడితో సినిమా చేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని విజయ్ కు ఎవరో చెప్పారట.
అప్పటికే తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో వారసుడు సినిమా చేసిన విజయ్, పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో మరో తెలుగు దర్శకుడితో సినిమా చేస్తే ప్రత్యర్థులు దాన్ని రాజకీయం చేసే అవకాశముందని సన్నిహితులు విజయ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో విజయ్ చివరి నిమిషంలో నాతో సినిమా చేయట్లేదని చెప్పారు.
కేవలం నేను ఒక తెలుగువాడిని అయినందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తప్పించారు అంటూ గోపీచంద్ మలినేని.. విజయ్ తో తన ప్రాజెక్ట్ మిస్ అవడంపై ఎమోషనల్ అయ్యారు.