హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కావడానికి జస్ట్ 2 రోజులే ఉంది. అది పూర్తి చెయ్యడానికి మిస్సైల్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ వీరమల్లు షూటింగ్ పూర్తి చెయ్యడానికి సెట్ లో అడుగుపెట్టారు. దానితో మేకర్స్ కి కాన్ఫిడెంట్ వచ్చేసింది. నిర్మాత రత్నం గారు హరి హర వీరమల్లు పై అద్దిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.
హరి హర వీరమల్లు రెండు రోజుల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగుపెట్టారు. ఇకపై హరి హార వీరమల్లు ఎక్స్ ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్స్ కమింగ్ వెరీ సూన్ అంటూ ఏ ఏం రత్నం ఇచ్చిన అప్డేట్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఏందిది .. వీరమల్లు నంచి ఇది ఊహించలేదబ్బా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
సో ఈ లెక్కన మే చివరి వారంలో హర హర వీరమల్లు రాక ఖాయమైనట్టే కనిపిస్తుంది.