పాపం పవన్ ఫ్యాన్స్.. హరి హర వీరమల్లు వస్తుంది అని ఎదురు చూడడం, అది పోస్ట్ పోన్ అవడం అనేది పరిపాటిగా మారింది. అన్నీ బావుంటే మే 9 న హరిహర వీరమల్లు విడుదల కావాలి, కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో అది కూడా వాయిదా పడింది. ఆ విషయం చెప్పకుండా మేకర్స్ కూడా నీళ్లు నములుతున్నారు.
ఈపాటికే వీరమల్లు షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది, పవన్ పని తెలుసుగా. ఇప్పుడు తన డేట్స్ ఓ నాలుగు రోజులైతే వీరమల్లు కు సరిపోతాయి. కాబట్టి పవన్ కాస్త ఖాళీ చేసుకుని హరి హర వీరమల్లు సెట్ లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. పాన్ ఇండియా కం హిస్టారిక్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయ్యాకే వీరమల్లు కొత్త తేదీ ప్రకటించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
ఈరోజు ఆదివారం నుంచే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారని, కొన్ని రోజుల్లో తన పార్ట్ షూట్ పూర్తయితే సినిమా మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇక మేకర్స్ మే చివరి వారమా, లేదంటే జూన్ లో హరి హర వీరమల్లు రిలీజ్ తేదీ ఇవ్వాలి అని ఫిక్స్ అవుతారట.