తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో నటించిన వివిధ భాషలకు చెందిన యాక్టర్స్ స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, బేబి శ్రీరామ్ దీత్య ఒక్కొక్కరుగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు దగ్గరకు వస్తారు. వీళ్లు తనకు బర్త్ డే విశెస్ చెప్పేందుకు వచ్చారని శ్రీరామ్ వేణు అనుకోగా...వాళ్లు మాత్రం తమ్ముడు సినిమా రిలీజ్ ఎప్పుడు ?, ప్రమోషన్ ఎప్పుడు బిగిన్ చేస్తారు ? ని అడుగుతారు.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న లయ. తన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు, రిలీజ్ డేట్ చెప్పడం లేదు అని అడుగుతుంది. చివరలో బేబి శ్రీరామ్ దీత్య కూడా నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ? అని అడుగుతుంది. దీంతో డైరెక్టర్ శ్రీరామ్ వేణు వాళ్లకు ఏం చెప్పాలో తెలియక మీకు ఇన్ఫామ్ చేస్తానంటూ పంపిస్తారు. చి
వరలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీరామ్ వేణు బర్త్ డే కేక్ కట్ చేయడంతో పాటు జూలై 4న తమ్ముడు మూవీ రిలీజ్ అంటూ ప్రకటిస్తారు. మంచి ఫన్ తో డిజైన్ చేసిన ఈ వీడియో క్రియేటివ్ గా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.