హిట్ ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొడుతున్న దర్శకుడు శైలేష్ కొలను పై ఇప్పుడు టాలీవుడ్ హీరోల కన్నుపడింది. హిట్ 1, హిట్ 2 తర్వాత శైలేష్ కి ఎంత క్రేజ్ ఉందొ తెలియదు కానీ.. హిట్ 3సక్సెస్ తర్వాత శైలేష్ కొలను పేరు మోగిపోతుంది. నాని నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన హిట్1 ఆలాగే 2, ఇంకా హిట్ 3 చిత్రాలు వేటికవే ప్రత్యేకమైన క్రైమ్ థ్రిల్లర్స్.
హిట్ 3 సక్సెస్ తర్వాత ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇస్తున్న శైలేష్ కొలను హిట్ 4 పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. హిట్ 4 కథ విషయంలో తానింకా ఓ నిర్ణయానికి రాలేదు, హిట్ 4 విషయంలో తనకు కేవలం ఒక ఆలోచన మాత్రమే ఉందని, దాన్ని ఇంకా ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చేయలేదని చెప్పిన శైలేష్ కొలను తాను ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం సిడ్నీకి వెళ్తున్నానని చెప్పాడు.
తన కొడుకుతో కలిసి టైమ్ స్పెండ్ చెయ్యడానికి సిడ్నీ వెళుతున్నట్టుగా చెప్పిన శైలేష్ కొలను అక్కడే కొన్ని నెలల పాటు ఉండి, రైటింగ్ పై ఫోకస్ చేస్తానని, తన మైండ్ లో ఉన్న కొన్ని ఆలోచనలను ఫుల్ స్క్రిప్ట్ మార్చాలనుకుంటున్నానని చెప్పారు కానీ తన తదుపరి మూవీ హిట్ 4 అని మాత్రం కన్ ఫర్మ్ చెయ్యలేదు.