ఇంతకంటే అకేషన్ ఇంకేముంది విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ తేదీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చెయ్యని రోజు లేదు. కానీ దర్శకుడు వసిష్ఠ మాత్రం విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వడానికి తెగ ఆలోచిస్తున్నారు. శ్రీరామనవమికి రామరామా సాంగ్ వదిలారు. ఆ సాంగ్ చాలా గ్రాండ్ హిట్ అయ్యింది. అప్పుడే రిలీజ్ తేదీ ఇస్తారని మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు.
ఈరోజు మే 4.. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష బర్త్ డే. త్రిష బర్త్ డే కి విశ్వంభర నుంచి త్రిష పోస్టర్ వదులుతూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. త్రిష అవని పాత్రలో అందంగా, అద్భుతంగా కనిపించింది. ఆ పోస్టర్ తో విడుదల తేది మాత్రం ఇవ్వకుండా మళ్లీ సస్పెన్స్ లో పెట్టారు. త్రిష బర్త్ డే పోస్టర్ తో పాటుగా విశ్వంభర రిలీజ్ తేదీని ఇవ్వొచ్చు కదా అనేది మెగా ఫ్యాన్స్ వాదన.
ఇంతకన్నా మంచి అకేషన్ ఏముంటుంది, ఇప్పటికైనా విశ్వంభర రిలీజ్ తేదీ లాక్ చేస్తే బావుండేది అనేది వారి ఆశ. కానీ వసిష్ఠ మాత్రం విశ్వంభర విషయంలో ఎందుకంత ఆలోచిస్తున్నారనేది అర్ధం కావడం లేదు.
Birthday poster introducing Trisha As Avani In Vishwambhara
Birthday poster introducing Trisha In Vishwambhara







































