ఢీ డాన్స్ షో మాత్రమే కాదు సోషల్ మీడియా లో ఉన్నవారెవరికైనా జాను లిరి అంటే తెలియని వారుండరు. నెమలి నాట్యం అంటే స్మూత్ గా క్యూట్ గా ఉంటుందేమో జాను లిరి డాన్స్ చేస్తే స్టేజ్ మాత్రమే కాదు ఏ లొకేషన్ అయినా షేక్ అవ్వాల్సిందే. అంత అందంగా, అంత అద్భుతంగా జాను లిరి డాన్స్ ఉంటుంది.
ఢీ డాన్స్ షో లో జెడ్జి గా ఉన్న శేఖర్ మాస్టర్ ఆమె డాన్స్ చూసి జాను.. జానూ.. జాను.. అంటూ చేసిన కామెంట్స్ తో శేఖర్ మాస్టర్ కి జానూ లిరికి మద్యన ఎఫ్ఫైర్ ఉంది అనే రూమర్స్ కు తావిచ్చింది. శేఖర్ మాస్టర్ పలుసందర్భాల్లో జాను లిరి అందరిలాగే ఓ డాన్సర్, ఆ అమ్మాయికి ఎంకరేజ్ చేస్తే మా మధ్యలో ఏదో ఉన్నట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా జాను లిరిరి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. తనపై చేస్తున్న ట్రోలింగ్ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఆత్మహత్య చేసుకుంటే సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేసేవారే కారణమవుతారు అంటూ ఏడుస్తూ పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. నాకు రెండో పెళ్లి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు, ఒక అన్నతో మాట్లాడినా లింకులు కడుతున్నారు.ఎవరితో మట్లాడినా వారితో లింక్ లు పెట్టి టార్చర్ పెడుతున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు?. నా వీడియోస్ పెట్టి ఏవేవో వాయిస్ లు పెట్టి నీచమైన వీడియోస్ చేస్తున్నారు. నాకు ఓ కొడుకున్నాడు, వాడు చూస్తే ఎలా ఉంటుంది. మీరు ఓ అమ్మకి పుట్టినవారే కదా, ఈ ట్రోల్స్ చూస్తుంటే నా జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు.. నేను చనిపోతే మీరే బాధ్యులు అంటూ ఎమోషనల్ గా జానూ లిరి పెట్టిన వీడియో సంచలనంగా మారింది.