నాగార్జున సోలో ప్రాజెక్టు అనౌన్సమెంట్ కోసం అక్కినేని అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. నా సామి రంగ తర్వాత నాగార్జున సోలో గా సినిమా మొదలు పెట్టలేదు. మల్టీస్టారర్స్ చేస్తున్నారు. రజినీకాంత్ కూలి, ధనుష్ కుబేర చిత్రాల్లో నాగార్జున కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.. తప్ప సోలో గా సినిమాని పట్టాలెక్కించలేదు.
ఈమధ్యన దర్శకుడు శైలేష్ కొలను తో నాగార్జున ప్రాజెక్ట్ ఓకె అవ్వబోతుంది, శైలేష్ కొలను చెప్పిన కథ నాగార్జున కు నచ్చింది అనే టాక్ నడిచింది. నాగార్జున, శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా రిజల్ట్ తెలియగానే శైలేష్ కొలను ప్రాజెక్ట్ ఓకె చేస్తారనే టాక్ నడిచింది.
మరి హిట్ 3 విడుదలైంది. సూపర్ హిట్ అయ్యింది. హిట్ 3 కి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కేవలం రెండు రోజుల్లో హిట్ 3 తో నాని 62కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టాడు, నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ హిట్ 3 కి వచ్చాయి. మరి ఇప్పుడు హిట్ 3 రిజల్ట్ వచ్చేసింది, నాగార్జున శైలేష్ కోలను ని పిలిచి ప్రాజెక్ట్ ఓకే చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.