కొంతమంది హీరోయిన్స్ కి ఎక్కడో సుడి ఉంటుంది. అందుకే మొదటి సినిమా యావరేజ్ అయినా, లేదంటే ప్లాప్ అయినా వరసబెట్టి అవకాశాలు వచ్చేస్తాయి. గతంలో పూజ హెగ్డే బాలీవుడ్ నుంచి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుని వచ్చినా ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. తర్వాత ఉప్పెన హిట్ తో బేబమ్మ కృతి శెట్టి వెనుక పడ్డారు యంగ్ హీరోలు.
ఇక శ్రీలీల సంగతి సరే సరి. పెళ్లిసందD ప్లాప్ అయినా ఆమెకి టాలీవుడ్ యంగ్ హీరోలంతా అవకాశాలు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసారు. ఇప్పుడు అలానే భాగ్యశ్రీ బోర్సేకి కూడా ఎక్కడో లక్కుంది. అందుకే అమ్మడు మొదటి సినిమా బిగ్ డిజాస్టర్ అయినా.. ఆమెకి వస్తోన్న ఆఫర్స్ చూస్తే నిజమే లక్కీ లేడీ అంటారేమో.
విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్, దుల్కర్ తో కాంత, రామ్ తో మరో చిత్రం, ఇప్పుడు ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీలో కూడా భాగ్యశ్రీ బోర్సే ని హీరోయిన్ గా అనుకుంటున్నారనే వార్తలు అమ్మడు రేంజ్ ని పెంచేస్తున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా భాగ్యశ్రీ బోర్సే రెడ్ శారీ లుక్ తో పాటుగా, బొప్పాయి ముక్కలు తింటూ బెడ్ పై ఉన్న పిక్స్ వదిలింది.
రెడ్ శారీ లో చాలా అమాయకంగా క్యూట్ గా కనిపించిన భాగ్యశ్రీ బోర్సే బెడ్ పై మాత్రం మోడ్రెన్ లుక్ లో కనిపించింది.. ఆ పిక్స్ చూసి లక్కీ లేడీ భాగ్యశ్రీ బోర్సే న్యూ లుక్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.