భర్త ఆనంద్ అహూజాతో కలిసి ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ బిజినెస్ లో తలమునకలుగా ఉన్న సోనమ్ కపూర్, వీలున్నప్పుడల్లా తన అందచందాలను ప్రదర్శించేందుకు ఒక వేదికను వెతుకుతుంది. అలాంటి ఒక వేదిక నుంచి వచ్చిన తాజా ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది.
సోనమ్ టాప్ లెస్ ఫోజ్ ఇప్పుడు సోషల్ మీడియాల్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేకపోయినా ఆ నుదిటిన భారీతనం నిండిన డిజైనర్ పాపిడిబొట్టుతో సోనమ్ కనిపించింది. వయసు 40కి చేరువ అవుతున్నా ఈ బ్యూటీ తన గ్లామరస్ రూపాన్ని పర్ఫెక్ట్ గా మెయింటెయిన్ చేయడంలో ఎప్పుడూ రాజీకి రావడం లేదు. సోనమ్ కపూర్ ఈ ఏడాది 14వ సారి `వోగ్ ఇండియా కవర్ గర్ల్`గా కనిపించింది. నమ్రతా సోని ఈ మేకప్ కోసం సహకరించారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో తుఫాన్ గా మారింది.
నటనా కెరీర్ విషయానికి వస్తే.. సోనమ్ చివరిగా బ్లైండ్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. నటన పరంగా, ఫ్యాషన్ సెన్స్ పరంగా వరుస ప్రయోగాలతో సోనమ్ ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.