Advertisementt

ఐదేళ్ల విధ్వంసం నుంచి ఏపీని కాపాడుతున్నాం-బాబు

Fri 02nd May 2025 06:26 PM
chandrababu  ఐదేళ్ల విధ్వంసం నుంచి ఏపీని కాపాడుతున్నాం-బాబు
Chandrababu Naidu thanks PM for being at Amaravati ఐదేళ్ల విధ్వంసం నుంచి ఏపీని కాపాడుతున్నాం-బాబు
Advertisement
Ads by CJ

ఈరోజు అమరావతి పునర్‌నిర్మాణ సభలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ, అలాగే రాజధాని అమరావతి, ప్రజల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రసంగించారు. ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు, గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు, గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి,మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం. గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు.  ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు, పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం, మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. 

మోదీజీ.. మేమంతా మీకు అండగా ఉన్నాం.  మోదీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది.  2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషి చేస్తున్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తు్న్నారు.  కలగణన చేయాలని మోదీ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కులగణన చేయాలన్నది కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయం.  

కూటమిగా పోటీచేసి 93 శాతం స్టైక్‌రేట్‌తో విజయం సాధించాం, వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం, కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం, ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టించాం - అమరావతి కేవలం నగరమే కాదు.. ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం, అమరావతి - 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు, అమరలింగేశ్వరస్వామి, కృష్ణానది, బౌద్ధారామాలకు నిలయం. 

వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు అనుభవించారు. అమరావతి లాంటి ఉద్యమాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు,  2024లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది, నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం, మోదీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం, మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోదీ రావాలి. 

ఇప్పటికే అత్యుత్తమ విద్యాసంస్థలు అమరావతికి వచ్చాయి, బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్ ఆర్ఐ వంటి మరిన్ని విద్యాసంస్థలు వస్తున్నాయి, 2027 నాటికి పోలవరం పూర్తవుతుంది, అమరావతినే కాదు.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం. జూన్ 21న విశాఖలో యోగా డేకు ప్రధానిని ఆహ్వానిస్తున్నాం, నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం, మోదీ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం, మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి మోదీ రావాలి అంటూ చంద్రబాబు ప్రసంగించారు. 

Chandrababu Naidu thanks PM for being at Amaravati:

Andhra Pradesh CM Chandrababu Naidu praised PM Modi

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ